ASIA CUP 2022: భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ ల వివరాలు..ఈ సారి పై చేయి ఎవరిది !

-

ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఆసియా కప్ ఫీవర్ నడుస్తోంది. ఆగస్టు – సెప్టెంబర్ నెలలు ఆసియాలో క్రికెట్ అభిమానులకు ప్రత్యేకమైనవి. మొత్తం ఆరు జట్లు తెలపడనున్న ఈ మెగా ఈవెంట్ లో టీమిండియా ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా భారత్ – పాకిస్తాన్ లలోని క్రికెట్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆసియా కప్ ప్రారంభం కాబోతోంది. కొత్త కెప్టెన్.. యువ ఆటగాళ్ల రాక నేపథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో టోర్నీలో అడుగుపెట్టనుంది టీమిండియా.

ముందుగా శ్రీలంకలో ఆసియా కప్ జరగాల్సి ఉంది. కానీ అక్కడి పరిస్థితుల దృశ్య ఈ టోర్నీని యూఏఈకి మార్చిన సంగతి తెలిసిందే. ఆసియా కప్ ఈనెల 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు జరగనున్నాయి. మొత్తం ఆరు జట్లు ఇందులో పాల్గొంటాయి. ఇందులో ఐదు జట్లు (భారత్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్) ఇప్పటికే అర్హత సాధించాయి. ఒక టీం కోసం నాలుగు జట్లు (హాంకాంగ్, కువైట్, సింగపూర్, యూఏఈ) పోటీ పడుతున్నాయి. ఇవి క్వాలిఫైయర్ టోర్నీ ఆడాల్సి ఉంది. ఆసియా కప్ లో భాగంగా ఆగస్టు 27న శ్రీలంక – ఆఫ్ఘనిస్తాన్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.

దీని తర్వాత ఆగస్టు 28 ఆదివారం రోజున భారత్ – పాకిస్తాన్ మధ్య పోరు జరగనుంది. ఈ జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ( గ్రూప్ ఎ) బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్. ( గ్రూప్ బి) భారత్, పాకిస్తాన్, క్వాలిఫైయర్ టీం. ఇక భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ల వివరాలకు వస్తే.. తొలి మ్యాచ్ దుబాయ్ వేదికగా ఆగస్టు 28న జరగనుంది. మరోవైపు సూపర్ ఫోర్ లో భాగంగా మరోసారి రెండు జట్లు తడపడే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news