అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా పుష్ప-2 తొలి సింగిల్ విడుదల..?

-

సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2 . పుష్ప ఫస్ట్ పార్ట్ ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు దానికి సీక్వెల్గా పుష్ప-ది రూల్ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15న పుష్ప 2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే… అల్లు అర్జున్ పుట్టిన రోజున(ఏప్రిల్ 8) పుష్ప-2 సినిమా నుంచి తొలి సాంగ్ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది బన్నీ బర్త్ డే రోజున రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక మందాన్న కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news