చరిత్ర సృష్టించిన ‘పుష్ప పుష్ప’ సాంగ్

-

సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2 . పుష్ప ఫస్ట్ పార్ట్ ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు దానికి సీక్వెల్గా పుష్ప-ది రూల్ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ నుంచి విడుదలైన ‘పుష్ప పుష్ప’ లిరికల్ సాంగ్ చరిత్ర సృష్టించింది.

ప్రపంచవ్యాప్తంగా 3 భాషల్లో (తెలుగు, హిందీ, తమిళ్) సాంగ్ ట్రెండింగ్లో ఉండటం ఇదే తొలిసారని మేకర్స్ వెల్లడించారు. తెలుగు వెర్షన్ ఇండియా, బహ్రెయిన్లో నంబర్ 1, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఖతర్ లో 3, ఆస్ట్రేలియాలో 17, సింగపూర్లో 21, యునైటెడ్ కింగ్డమ్ లో 25, కెనడాలో 26, ఐర్లాండ్లో 28వ స్థానంలో ట్రెండ్ అవుతోందని తెలిపారు.ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15న పుష్ప 2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు.ఈ సినిమాలో రష్మిక మందాన్న కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news