హార్దిక్ పాండ్య కి మినహాయింపు ఎందుకు: ఇర్ఫాన్ పఠాన్

-

జూన్ 2 నుంచి ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్ కప్ జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. ఇక ఈ ఎంపిక చేయబడిన జట్టుపై పలువురు భిన్నభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇర్ఫాన్ పఠాన్ టి20 వరల్డ్ కప్ జట్టు పైన స్పందించారు.ఫామ్లో లేని హార్దిక్ పాండ్యకు T20 ప్రపంచకప్ లో వైస్ కెప్టెన్సీ అప్పగించడాన్ని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తప్పుపట్టారు. ‘దేశవాళీ క్రికెట్లో నిరూపించుకోవాలంటూ అయ్యర్, ఇషాన్ను పక్కన పెట్టారు. మరి ఆ నిబంధన హార్దిక్కు వర్తించదా. భారత క్రికెట్లో అతడి నిలకడ, నిబద్ధతపై సందేహాలు ఉన్నాయి. సెలక్టర్ల ప్రణాళిక ఒక్కోసారి ఒక్కోలా ఉంటోంది. వైస్ కెప్టెన్గా బుమ్రా సరైన ఆటగాడు’ అని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డారు.

కాగా, ప్రపంచకప్ జట్టులో కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను సెలెక్ట్ చేసింది బీసీసీఐ. టీ 20 వరల్డ్ కప్ కి పంత్, శాంసన్ ఇద్దరిలో ఎవ్వరినీ ఎంపిక చేస్తారనే ఉత్కంఠకు తెరపడిందనే చెప్పాలి. ఇద్దరినీ ఎంపిక చేసింది బీసీసీఐ. ఇక కే.ఎల్. రాహుల్ కు మాత్రం బీసీసీఐ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. రిజర్వు ప్లేయర్ గా ఎంపికవుతాడనుకున్న రాహుల్ ని ఎంపిక చేయకపోవడం గమనార్హం.

 

Read more RELATED
Recommended to you

Latest news