పుష్ప ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌.. థియేట‌ర్ల‌లో రేప‌టి నుంచి 5 షో లు

-

పుష్ప ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అదిరిపోయే శుభ‌వార్త చెప్పింది తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం. ప్ర‌తి రోజూ ఐదు షో లు వేసుకునేందుకు నిజాం లోని అన్ని థియేట‌ర్ల‌కు అనుమ‌తులు ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం. డిసెంబ‌ర్ 17 వ తేదీ నుంచి… 30 వ తేదీ వ‌ర‌కు ఐదు షో లు వేసుకునేందుకు థియేట‌ర్ల‌కు అనుమ‌తులు ఇచ్చింది తెలంగాణ ప్ర‌భుత్వం.

అంటే.. రెండు వారాల పాటు ఈ ఐదు షో లు కొన‌సాగ‌నున్నాయి. క‌రోనా నియ‌మ నిబంధ‌నాలు.. పాటిస్తూ… థియేట‌ర్లు న‌డుపుకోవాల‌ని.. జీవో జారీ చేసింది తెలంగాణ ప్ర‌భుత్వం. కాగా.. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో టాలీవుడ్ సంచలన డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన నటిస్తోంది. అలాగే ఫాహద్ ఫాజిల్ ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ లో నటిస్తుండగా… సునీల్, జబర్దస్త్ యాంకర్ అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news