కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన…

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేంద్ర జలశక్తి సలహా మండలి అనుమతులు ఉన్నాయని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వమే సొంత ఖర్చుతో ప్రాజెక్ట్ నిర్మిస్తుందని తెలిపింది. ఇప్పటి వరకు 83.7 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపింది.  18.25 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడంతో పాటు మరో 18.82 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగిందని పార్లమెంట్లో కేంద్ర వెల్లడించింది. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ అడిగిన ప్రశ్నకు గానూ ఈ వివరాలను వెల్లడించింది కేంద్రం.

Kaleswaram project

కాళేశ్వరం ప్రాజెక్ట్ కు అనుమతులు ఉన్నాయా అని ఉత్తమ్ కుమార్ ప్రశ్నించగా.. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సమాధానం ఇచ్చారు. 240 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు అనువుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ. 80,321.57 కోట్లు ఖర్చు అయినట్లు కేంద్రం వెల్లడించింది. కాగా రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్కు జాతీయ హోదా ఇవ్వాలంటూ పదేపదే కోరుతోంది. ఏపీలో పోలవరానికి ఇచ్చినట్లు తెలంగాణలో పాలమూరు – రంగారెడ్డి లేదా కాళేశ్వరం ప్రాజెక్ట్కు జాతీయ హోదా కల్పించాలంటూ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది.