Pushpa Trailer : పుష్ప ట్రైలర్ రిలీజ్..ఇక బన్నీ ఫాన్స్ కు పూనకాలే

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. సక్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ సుకుమార్ ల కాంబోలో రూపొందితున్న సినిమా పుష్ప‌. గ‌తంలో వీరిద్ద‌రి క్రేజీ కాంబీనేష‌న్ లో వ‌చ్చిన ఆర్య సిరీస్‌… ఎలాంటి హిట్ సాధించిందో అంద‌రికీ తెలిసిందే. మ‌రోసారి ఈ క్రేజీ కాంబి నేష‌న్ రిపీట్ కావ‌డంతో… పుష్ప సినిమా పై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. రెండు భాగాలు గా ఈ సినిమా తెర‌కెక్కిస్తున్నారు డైరెక్ట‌ర్ సుకుమార్‌. స‌క్సెస్ పుల్ మూవీ మేక‌ర్స్ కి కేరాఫ్ గా ఉండే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‏తో నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన‌.. టీజ‌ర్స్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ భారీ స్థాయిలో వ‌చ్చింది. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైల‌ర్ ను విడుల చేసింది చిత్ర బృందం. ఈ ట్రైలర్ లో అల్లు అర్జున్.. తన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. అలాగే ఈ సినిమాలో నటించిన కీలక నటులంతా దుమ్ములేపే సారు. తగ్గేదేలే.. అన్న డైలాగ్ ఈ ట్రైలర్ కు హైప్ క్రియేట్ చేసింది. తాజాగా విడుద‌ల అయిన ట్రైల‌ర్.. సినిమా పై అంచ‌నాల‌ను అమాంతం పెంచేసింది. కాగా… పుష్ప సినిమా డిసెంబ‌ర్ 17 వ తేదీన విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news