కోహ్లిని పక్కన పెట్టి రోహిత్ ని కెప్టెన్ చేయండి…!

-

ఐపీఎల్ 2020 ఫైనల్లో ముంబై ఇండియన్స్ విజయం సాధించి… అయిదవ సారి కప్ గెలిచి సంచలనం సృష్టించింది. ఢిల్లీ మీద మంచి విజయం సాధించింది. ఈ క్రమంలో… ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ రోహిత్ శర్మ నాయకత్వంపై ప్రసంశలు కురిపించాడు. టి 20 మ్యాచ్ లు ఏ విధంగా కూడా గెలవాలో రోహిత్ శర్మకి తెలుసు అని వాన్ పేర్కొన్నాడు. మరో ప్రశ్న లేకుండా రోహిత్ ని కెప్టెన్ ని చేయమన్నాడు.

అతను అద్భుతమైన వ్యక్తి అలాగే మేనేజర్ అన్నాడు. టి20 మ్యాచ్ లు ఎలా గెలవాలో అతనికి తెలిసినంత బాగా మరొకరికి తెలియదని అన్నాడు. విరాట్ కోహ్లీ కాస్త ఊపిరి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అని తద్వారా ఆటగాడిగా రాణించే అవకాశం ఉంటుంది అని అన్నాడు. ప్రపంచంలో అన్ని జట్ల మీద ఇది వర్క్ అవుతుందని అని వ్యాఖ్యానించాడు.

Read more RELATED
Recommended to you

Latest news