వాస్తు: ఆర్ధిక ఇబ్బందులు మీ ఇంట్లో ఉండకుండా ఉండాలంటే వీటిని ఇంట్లో పెట్టండి..!

-

మన ఇంట్లో ఏదైనా సమస్య వచ్చిందంటే పరిష్కరించుకోవాలి అని అనుకుంటూ ఉంటాం. అయితే ఈ వాస్తు చిట్కాలను కనుక ఫాలో అయితే కచ్చితంగా సమస్యల నుండి బయట పడవచ్చు. ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్యల్లో ఆర్ధిక సమస్య కూడా ఒకటి. ఆర్థిక ఇబ్బందులు కలగడం, ఆర్థిక నష్టం లాంటిది కనుక ఉంటే అప్పుడు తప్పకుండా ఈ చిట్కాలను అనుసరించండి.

దీంతో వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. అయితే ఇంట్లో లక్ష్మీ దేవి ఉండాలన్నా.. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలన్నా ఈ విధంగా ఫాలో అవ్వండి. దీనితో నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వీటిని ఇంట్లో ఉంచితే కచ్చితంగా ధనలక్ష్మి మీ ఇంట్లో ఉంటుంది.

ఫ్లూట్ ని ఇంట్లో ఉంచితే వాస్తు దోషాలను తొలగించుకోచ్చు. అలానే ఆర్థిక ఇబ్బందులు కూడా వుండవు. సిల్వర్ ఫ్లూట్ ని పెట్టుకుంటే మంచిది. తూర్పు లేదా ఉత్తరం వైపు ఈ ఫ్లూట్ ని ఉంచితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వెండితో చేసిన వాటిని పెట్టుకోవచ్చు లేదు అంటే వెదురుతో చేసిన దానినైన పెట్టుకోవచ్చు. ఇవి పెట్టడం వల్ల చాలా మంచి కలుగుతుంది.

వ్యాపారంలో చదువులో ఉద్యోగంలో కూడా ఇబ్బందులు ఉండవు. అలానే వినాయకుడి విగ్రహం పెట్టడం వల్ల సమస్యలు తొలగిపోతాయి. అలానే ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఇంట్లో వినాయకుడు నాట్యం చేస్తున్న విగ్రహాన్ని పెడితే చాలా మంచిది. ఇలా కూడా ఆర్థిక సమస్యలను తొలగించుకోవచ్చు. అలానే ఇంట్లో లక్ష్మీదేవి ఫోటోలు పెట్టండి.

ఇలా చేయడం వల్ల ధనం పెరుగుతుంది. కుబేరుడు విగ్రహం ఇంట్లో పెట్టడం వల్ల కూడా ధనలక్ష్మి ఇంట్లోకి వస్తుంది. అలాగే శంఖాన్నికూడా ఇంట్లో పెడితే వాస్తు దోషాలు తొలగిపోతాయని.. ఆర్థిక సమస్యలు ఉండవని పండితులు అన్నారు. కొబ్బరికాయ ఇంట్లో ఉంచితే కూడా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇలా ఈ విధంగా మీరు ఫాలో అయితే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news