గోల్డెన్ తుజా.. మోర్‌పంఖీ.. ఈ మొక్కలను ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. దీన్ని చూస్తే నెమలి ఈకలు గుర్తుకు వస్తాయి. ఈ మొక్కను చాలా మంది ఇండ్లలో అలంకరణ కోసం పెంచుకుంటారు. కానీ ఇది మనీ ప్లాంట్ తరహా మొక్క. అందువల్ల దీన్ని ఇంట్లో జాగ్రత్తగా పెంచుకోవాలి. అలా చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
1. మోర్‌పంఖీ మొక్కలను సరి సంఖ్యలోనే పెంచాలి. బేసి సంఖ్యలో పెంచరాదు. అంటే 1, 3 కాకుండా.. 2, 4 ఇలా సరి సంఖ్యలో మొక్కలను తీసుకుని వాటిని పెంచాల్సి ఉంటుంది. అప్పుడే ధనం ఆకర్షించబడుతుంది.
2. ఈ మొక్కను ఇంటి లోపల లేదా బయట ఎక్కడైనా పెంచుకోవచ్చు. తోటలోనూ పెట్టుకోవచ్చు. అలంకరణ మొక్కగా కూడా ఇది పనిచేస్తుంది. చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటుంది.
3. ఈ మొక్కను ఇంట్లో పెడితే సూర్యకాంతి పడేలా చూడాలి. అంటే కిటికీల వద్ద పెట్టుకోవడం ఉత్తమం.
4. ఇంటి బయట ఈ మొక్కను పెడితే ప్రధాన ద్వారం వద్దే ఉండేలా చూసుకోవాలి. దీంతో ధనం ఆకర్షించబడుతుంది.
5. ఇంట్లో ఎవరి ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ఈ మొక్కను పెంచుకుంటే సత్ఫలితాలు వస్తాయి.
6. ఈ మొక్క ఒక వేళ ఎండిపోతే వెంటనే తీసేసి ఇంకో మొక్కను పెట్టాలి. అంతేకానీ ఎండిపోయిన మొక్కలను పెంచరాదు.
7. ఈ మొక్క సమీపంలో దీపాలను ఉంచరాదు. దీని వల్ల వ్యతిరేక శక్తుల ప్రభావం పడుతుంది. సమస్యలు వస్తాయి.
8. రాహు మహాదశ కలిగి ఉన్నవారు ఈ మొక్కను పెంచుకుంటే ప్రయోజనం ఉంటుంది. సమస్యలు తొలగిపోతాయి.