మెగాస్టార్ ‘బాస్​ పార్టీ’ సాంగ్​కు బ్యాడ్మింటన్ స్టార్ PV సింధు డ్యాన్స్.. వీడియో వైరల్

-

బ్యాడ్మింటన్‌ స్టార్‌ ప్లేయర్ పీవీ సింధు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్​గా ఉంటుంది. తరచూ ఫొటోషూట్స్.. రీల్స్ చేస్తూ సందడి చేస్తుంది. అప్పుడప్పుడు తనకు నచ్చిన పాటలపై స్టెప్పులేస్తుంది. ఇలా బ్యాడ్మింటన్ ఆటలోనే కాదు సింధు డ్యాన్స్‌లోనూ అదరగొడుతోంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు కెరీర్‌ విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.

తాజాగా సింధు షేర్ చేసిన ఓ వీడియోలో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సంక్రాంతికి రిలీజ్ అయి సూపర్ హిట్ బ్లాక్​బస్టర్​గా నిలిచిన వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవి స్టెప్పులేసిన బాసు.. వేర్ ఈజ్ ద పార్టీ పాటకు సింధు హుషారుగా స్టెప్పులేసింది. బ్లూ కలర్ ఎంబ్రాయిడరీ లెహంగాలో ఎంతో స్టైలిష్‌గా కనిపించింది సింధు. ప్రస్తుతం ఈ డ్యాన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను షేర్​ చేసిన కొన్ని గంటల్లోపే 2.5 లక్షలకుపైగా లైకులు వచ్చాయి. వేలాది కామెంట్లు కూడా వచ్చాయి.

https://www.youtube.com/shorts/Ky5kWTDJ1hA

Read more RELATED
Recommended to you

Latest news