తైజూతో ఫైట్ కు పీవీ సింధు రెడీ : బలబలాలు ఇవే !

-

పీవీ సింధుకు సెమీస్ లో కఠిన సవాల్ ఎదురుకానుంది. మరికొద్ది క్షణాల్లో వరల్డ్ నెంబర్ వన్‌ తైజుయింగ్‌ తో సెమీస్‌ మ్యాచ్ జరుగనుంది. ఇప్పటివరకు సింధు, తైజుయింగ్‌తో 18 సార్లు తలపడగా కేవలం ఐదు సార్లు మాత్రమే విజయం సాధించింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 15 మ్యాచ్‌లు ఆడిన తైజుయింగ్‌ 12 మ్యాచుల్లో విజయం సాధించింది. కేవలం మూడు మ్యాచ్‌ల్లోనే ఓడిపోయింది.

తన కేరీర్‌లో మెత్తం 558 మ్యాచ్‌ల్లో 406 గెలిచిన తైజుయింగ్‌ ప్రపంచ నెంబర్ వన్‌ స్ధానంలో కొనసాగుతోంది. తైజుయింగ్‌ ఒలింపిక్స్‌లో ఒక్క పతకం కూడా గెలుచుకోలేదు. ఈసారి మెడల్ లక్ష్యంగా ఆడుతోంది. లండన్‌, రియో ఒలింపిక్స్‌లో ఆడిన తైజుయింగ్‌ కనీసం క్వార్టర్‌ ఫైనల్స్‌ కూడా చేరుకోలేదు. రియో ఒలింపిక్స్‌లో సింధు చేతిలో తైజుయింగ్ ఓటమి పాలైంది. ఈసారి సింధూ ను ఎలాగైనా ఓడించాలని తైజుయింగ్‌ టార్గెట్ ఫిక్స్‌ చేసుకుంది. 2020 వరల్డ్ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో సింధును ఓడించింది తైజుయింగ్‌. అయితే ఇవాళ జరిగే మ్యాచ్‌ లో ఎవరు గెలుస్తారో చూడాలి.

సెమీఫైనల్ వ‌ర‌కు పివి సింధు

క్సేనియా పోలికార్పోవాను 21-7, 21-10 తేడాతో విజ‌య ఢంకా మ్రోగించి సెమీస్‌లో స్థానం సంపాదించింది.
చెయుంగ్ న్గన్ యిని 21-9, 21-16 పాయింట్ల‌తో నెగ్గింది.
మియా బ్లిచ్‌ఫెల్డ్‌ను 21-15, 21-13తో ఓడించింది
అకనే యమగుచిని 21-13, 21-20 రెండు సెట్ల‌లోనే క‌థ ముగించేసింది.

PV Sindhu vs Tai Tzu Ying (5-13)

Tournament Player Score Player Date Won
World Tour Finals 2020 (in 2021) PV Sindhu 21-19 12-21 17-21 Tai Tzu Ying 1/27/2021 Tai Tzu Ying
 Malaysia Masters 2020 PV Sindhu 16-21 16-21 Tai Tzu Ying 1/10/2020 Tai Tzu Ying
French Open 2019 PV Sindhu 16-21 26-24 17-21 Tai Tzu Ying 10/25/2019 Tai Tzu Ying
World Championships 2019 PV Sindhu 12-21 23-21 21-19 Tai Tzu Ying 8/23/2019 PV Sindhu
World Tour Finals 2018 PV Sindhu 14-21 21-16 21-18 Tai Tzu Ying 12/13/2018 PV Sindhu
Asian Games 2018 ( Individual Event) PV Sindhu 13-21 16-21 Tai Tzu Ying 8/28/2018 Tai Tzu Ying
 Malaysia Open 2018 PV Sindhu 15-21 21-19 11-21 Tai Tzu Ying 6/30/2018 Tai Tzu Ying
 Hong Kong Open 2017 PV Sindhu 18-21 18-21 Tai Tzu Ying 11/26/2017 Tai Tzu Ying
 Australian Open 2017 PV Sindhu 21-10 20-22 16-21 Tai Tzu Ying 6/23/2017 Tai Tzu Ying
All England Open 2017 PV Sindhu 14-21 10-21 Tai Tzu Ying 3/10/2017 Tai Tzu Ying
 Hong Kong Open PV Sindhu 15-21 17-21 Tai Tzu Ying 11/27/2016
Rio 2016 Olympic Games PV Sindhu 21-13 21-15 Tai Tzu Ying  8/15/2016 PV Sindhu
 Badminton Asia Championships 2016 PV Sindhu 21-13 20-22 8-21 Tai Tzu Ying  4/28/2016 Tai Tzu Ying
Denmark Open 2015 PV Sindhu 21-12 21-15 Tai Tzu Ying  10/15/2015 PV Sindhu
Yonex Open Chinese Taipei 2015 PV Sindhu 15-21 17-21 Tai Tzu Ying  7/16/2015 Tai Tzu Ying
 India Open 2012 PV Sindhu 21-17 21-19 Tai Tzu Ying 4/25/2012 PV Sindhu
All England Open  2012 PV Sindhu 21-14 16-21 19-21 Tai Tzu Ying 3/7/2012 Tai Tzu Ying
Vietnam Grand Prix Open 2011 PV Sindhu 21-11 11-21 19-21 Tai Tzu Ying 8/26/2011 Tai Tzu Ying

 

Read more RELATED
Recommended to you

Latest news