టోక్యో ఒలింపిక్స్: ఎనిమిదో రోజు మిశ్రమ ఫలితాలు

-

టోక్యో ఒలింపిక్స్ ఎనిమిదో రోజు భారత్‌కు నిరాశజనక ఫలితాలు వచ్చాయి. బాక్సర్ అమిత్ పంగల్ 16వ బౌట్‌లో కొలంబియా క్రీడాకారుడు యుర్బెర్జెన్ మార్టినెజ్ చేతిలో ఓటమిపాలయ్యాడు. ఆర్చరీ మెన్స్ సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైన‌ల్స్‌లో అతాను దాస్ సైతం ఓటమిపాలయ్యాడు. ఆశాజన విషయం ఏమిటంటే డిస్కస్ త్రోలో కమల్‌ప్రీత్ కౌర్ ఫైనల్స్‌కు చేరుకున్నది. క్వాలిఫైయింగ్ రౌండ్‌లో అద్భుతమైన ప్రదర్శనతో రెండో స్థానంలో నిలిచింది. మహిళల హాకీ జట్టు దక్షిణాఫ్రికాపై 4-3 తేడాతో విజయం సాధించడంతో నాకౌట్ ఆశలు సజీవంగా నిలిచాయి. షూటింగ్‌లో భారత క్రీడాకారుల పేలవ ప్రదర్శన కొనసాగుతున్నది. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్‌లో అంజుమ్ మౌడ్గిల్, తేజస్విని సావంత్ ఫైనల్స్‌కు చేరుకోలేకపోయారు. క్వాలిఫైయింగ్ రౌండ్‌లో అంజుమ్ 15, తేజస్విని 33 స్థానంతో సరిపెట్టుకున్నారు.

పీవీ సింధుపైనే ఆశలు

బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధుపైనే భారత్ ఆశలు పెట్టుకున్నది. సెమీఫైన‌లో భాగంగా వరల్డ్ నెంబర్ 1, చైనీస్ తైపి క్రీడాకారిణి తై త్జు – ఇంగ్‌తో పీవీ సింధు తలపడనున్నది. ఈ మ్యాచ్‌లో సింధు విజయం సాధిస్తే భారత్‌కు మరో పతకం ఖాయమైనట్లే. ఇప్పటికే వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను భారత్‌కు తొలి పతకం అందజేసింది. సెమీఫైనల్‌లో పీవీ సింధు విజయం సాధించి రెండోసారి ఒలింపిక్స్ ఫైనల్స్‌కు చేరుకుంటుందా? లేక కాంస్య పతకంతో సరిపెట్టుకుంటుందా? అనే విషయం ఈరోజు తేలిపోనున్నది

Read more RELATED
Recommended to you

Latest news