తెలుగు తేజం, భారత టాప్ షట్లర్ పీవీ సింధు మరోసారి సత్తా చాటింది. రెండు ఒలింపిక్ పతకాలు గెలుచుకున్న పీవీ సింధు థాయ్‌లాండ్ ఓపెన్ 2022 సెమీస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. థాయ్ లాండ్ ఓపెన్ లో ప్రపంచ నెంబవర్ వన్ అకానె యమగూచి ను చిత్తు చేస్తూ సెమీ ఫైనల్స్ కు దూసుకెళ్లింది. క్వార్ట్ ఫైనల్లో యమగూచిని 21-15, 20-22, 21-13 తేడాతో మట్టికరిపించింది. తొలి గేమ్‌లో సింధు 21-15 తేడాతో విజయం సాధించింది.
అయితే రెండో గేమ్‌లో పుంజుకున్న జపాన్ 20-22తో విజయం సాధించింది. సింధు చివరి గేమ్‌ను 21-13 తేడాతో గెలుపొందింది. ఫలితాన్ని నిర్ణయించే మూడే గేమ్ లో యమగూచి వెన్నునొప్పితో ఇబ్బంది పడింది. ఇదే అదనుగా స్మాష్ షాట్లతో విరుచుకుపడిన సింధు మూడో గేమ్ ను సొంతం చేసుకుని సెమీస్ కు చేరింది. సెమీస్ లో చైనాకు చెందిన ఒలింపిక్స్ ఛాంపియన్ చెన్ యూ ఫీతో సింధు తలపడనుంది.