పీవీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్, తమిళిసై

హైదరాబాద్: పీవీ జ్ఞాన భూమిలో పీవీ నరసింహారావు కాంగ్య విగ్రహాన్ని సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళి సై ఆవిష్కరించారు. పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఇవాళ పీవీ జయంతి సందర్భంగా పీవీ ఘనతను చాటేలా తెలంగాణ ప్రభుత్వం పీవీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.

పీవీ నరసింహరావు తెలంగాణ ముద్దు బిడ్డకావడంతో ఏడాది పాటు ఆయన జయంతి ఉత్సవాలను నిర్వహించారు. పీవీ సొంతూరు వంగరను ప్రభుత్వం గొప్పపర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తోంది. వందేళ్ల క్రితం కట్టిన వంగరలోని ఆయన సొంతింటిని పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ‘పీవీ నర్సింహారావు మెమోరియల్‌ మ్యూజియం’గా అభివృద్ధి చేసే పనులకు కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

కాగా పీవీ నరసింహారావు జూన్ 28, 1921లో కరీంనగర్ జిల్లా వంగరలో జన్మించారు. మంథని నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా మొత్తం వివిధ స్థానాల్లో పోటీ చేసి 6 సార్లు ఎంపీగా గెలిచారు. 1996లో నంద్యాల నుంచి ఎంపీగా గెలిచారు. తెలుగు వ్యక్తి ప్రధాని అవుతున్నాడని ఎన్టీఆర్ వీపీకి పోటీగా అభ్యర్థిని నిలబెట్టకపోవడం విశేషం. రాజీవ్ గాంధీ హయాలో 9వ ప్రధానమంత్రిగా పని చేశారు. దేశంలో ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ సంస్కరణలే ఇప్పటికీ దేశంలో కొనసాగుతూనే ఉన్నాయి.