బ్రేకింగ్ : ఆసుపత్రిలో చేరిన ఆర్.కృష్ణయ్య

-

బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య.. ఆస్పత్రిలో చేరారు. స్పృహ తప్పి పడిపోయిన ఆర్.కృష్ణయ్య… హైదరాబాద్ లోని ఓ ప్రవేట్ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం అందుతోంది. హైదరాబాద్ బషీర్ బాగ్ లోని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కార్యాలయం ముందు ధర్నా చేపట్టింది బిసి సంక్షేమ సంఘం.

అయితే ఈ ధర్నా కార్యక్రమం లో బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య కూడా పాల్గొన్నారు. మోడల్ స్కూల్స్ లో పని చేసే గెస్ట్ టీచర్స్ ఆందోళన కు మద్దతు తెలుపుతూ.. ఈ కార్యక్రమం లో ఆర్. కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ నేపథ్యం లోనే స్పృహ తప్పి పడిపోయారు ఆర్.కృష్ణయ్య. దీంతో హుటా హుటిన కృష్ణయ్య ను ఆసుపత్రికి తరలించారు బిసి సంక్షేమ సంఘం నాయకులు. ప్రస్తుతం ఆయన ఓ ప్రవేట్ ఆస్పత్రి లో వైద్యం తీసుకుంటున్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news