ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్తితి మెరుగుపడేలా కనిపించడం లేదు. ఎన్నికలై రెండేళ్ళు దాటేసిన కూడా కొందరు నాయకులు సరిగా పార్టీ కోసం పనిచేయడం లేదు. అయితే పార్టీని ఓటమి నుంచి బయటపడేసేందుకు చంద్రబాబు ఏదొకవిధంగా కష్టపడుతూనే ఉన్నారు. ఓ వైపు చంద్రబాబు, మరో వైపు నారా లోకేష్‌లు టిడిపిని గాడిలో పెట్టడానికి పనిచేస్తున్నారు. అలాగే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అసలు జగన్ ప్రభుత్వంతో నిత్యం ఫైట్ చేస్తూనే ఉన్నారు.
ఇక వీరికి తోడుగా కొందరు నాయకులు పార్టీ కోసం బాగానే పనిచేస్తున్నారు. వారి నియోజకవర్గాల పరిధిలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ, పార్టీని బలోపేతం చేయడానికి చూస్తున్నారు. కానీ మరికొందరు నాయకులు మాత్రం పోరాటం చేస్తున్నట్లు నటిస్తున్నట్లు కనిపిస్తోంది. మామూలుగా చంద్రబాబు….రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తే….ఆ కార్యక్రమాల్లో టిడిపి నాయకులు పాల్గొని విజయవంతం చేయాల్సి ఉంటుంది.
అయితే కొందరు నాయకులు నిజంగానే కార్యక్రమాల్లో పాల్గొంటూ, పోరాటాలు చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం మీడియా, సోషల్ మీడియాలో కనిపించడానికి మాత్రమే పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. ఏదో కార్యక్రమానికి వచ్చామా…నాలుగు ఫోటోలు దిగేసి సోషల్ మీడియాలో పెట్టేసి…తాము ఇరగదీసేశామని చెప్పుకుంటున్నారు. ఇలా అనేక కార్యక్రమాల్లో నాయకులు ఇదే వరుసలో పనిచేస్తున్నారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే పార్టీలో ఉన్న కొందరు మహానటులు….హౌస్ అరెస్ట్‌ల పేర్లతో డ్రామాలు ఆడుతున్నారని తెలుస్తోంది.
ఉదాహరణకు తాజాగా నారా లోకేష్, నరసారావుపేట కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా చాలామంది నాయకులని పోలీసులు ముందుగానే హౌస్ అరెస్ట్ చేశారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే…కొందరు నాయకులు ముందుగానే పోలీసులని పిలిపించి హౌస్ అరెస్ట్ అయిపోయి, నాలుగు ఫోటోలని తీసుకుని సోషల్ మీడియాలో పెట్టేసి…జగన పాలనలో పోలీసుల రాజ్యం నడుస్తుందని నాలుగు కామెంట్లు పెట్టేస్తున్నారు. ఈ విధంగా టిడిపిలో కొందరు మహానటులు పనిచేస్తున్నారని తెలుస్తోంది…పర్ఫామెన్స్లో ఎవరూ తగ్గట్లేదనే చెప్పొచ్చు.