రచిన్ రవీంద్ర విధ్వంసం.. ఏకంగా డబుల్ సెంచరీతో..!

-

మౌంట్ మాంగనుయ్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ లో న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర దుమ్మురేపుతున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో రవీంద్ర అద్భుమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు. 340 బంతుల్లోో 21 ఫోర్లు, 1 సిక్స్ తో డబుల్ సెంచరీ మార్క్ ను అందుకున్నాడు. రవీంద్ర తన తొలి సెంచరీనే ద్విశతకంగా మార్చాడు.

ప్రస్తుతం రవీంద్ర 220 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. 135 ఓవర్లు ముగిసే సరికి తొలి ఇన్నింగ్స్ లో కివీస్ 5 వికెట్ల నష్టానికి 435 రుగులు చేసింది. క్రీజ్ లో రవీంద్రతో పాటు గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు. అదేవిధంగా మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో కివీస్ 5 వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్రపాటు గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు.

రచిన్ రవీంద్రతో పాటు విలియమ్సన్ కూడా సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో విలియమ్సన్ 118 పరుగులు చేశాడు. గత ఏడాది భారత్ వేదికగా జరిగినట్టే వరల్డ్ కప్ లో రచిన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version