రాధేశ్యామ్: ప్రభాస్ అభిమానులు రెడీగా ఉండండమ్మా..

-

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ చిత్రీకరణ మొదలయినప్పటి నుండి అప్డేట్లు అందించడంలో ఆలస్యం చేస్తూ వచ్చారు. ఒకానొక దశలో నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ ని బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో ట్రెండ్ కూడా జరిగింది. ఐతే ఇప్పుడిప్పుడే మెల్లగా అప్డేట్లు మొదలయ్యాయి. మొన్నటికి మొన్న పూజా హెగ్డే పుట్టినరోజు సందర్భంగా రాధేశ్యామ్ నుండి ఫస్ట్ లుక్ రిలీజైన సంగతి తెల్సిందే.

తాజాగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ రానుంది. అక్టోబర్ 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రాధేశ్యామ్ చిత్రం నుండి మోషన్ పోస్టర్ రిలీజ్ అవుతుందట. ఈ మేరకు భీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ అక్టోబర్ 23వ తేదీ విడుదల అవుతుందంటూ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. జిల్ ఫేమ్ రాధాక్రిష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్, గోపీక్రిష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version