సింగర్ సునీత కొడుకు కోసం భారీ స్కెచ్ వేసిన రాఘవేంద్రరావు..!

-

ప్రముఖ సింగర్ సునీత కొడుకు ఆకాష్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఆకాష్ హీరోగా వెండితెరపై అడుగు పెట్టబోతున్నాడు.. సునీత తన కొడుకును హీరో చేయడం కోసం దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావును సంప్రదించినట్లు తెలుస్తోంది . ఈ క్రమంలోనే ఆయన ఒక అద్భుతమైన కథను తయారు చేశారట. ప్రస్తుతం ఈ సినిమాలో ఆర్కే టెలీ షో పతాకం పై నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా గంగన మోని శేఖర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.” సర్కారు నౌకరి” అనే సినిమాతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలను కూడా నిర్మాణ సంస్థ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

ఇందులో ఆకాష్ సరసన నూతన నటి భావన వలపండల్ హీరోయిన్ గా నటిస్తోంది. సినిమా ప్రారంభోత్సవంలో జి స్టూడియోస్ నిర్మాత ప్రసాద్ నిమ్మకాయల కెమెరా స్విచ్ ఆన్ చేయగా మ్యాంగో మీడియా అధినేత సునీత భర్త రామ్ వీరపనేని గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దేవుడి పటాలపై క్లాప్ ఇచ్చారు. అనంతరం హీరో హీరోయిన్లపై తీసిన తొలి షార్ట్ కే రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా.. సునీత కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఫిబ్రవరి 6 నుంచి షూటింగ్ జరుపుకోనున్నట్లు సమాచారం.

ఇందులో తనికెళ్ల భరణి, సాయి శ్రీనివాస్ వడ్లమాని, సూర్య , మణిచందన, రాజేశ్వరి ముళ్ళపూడి, రమ్య పొందూరి, త్రినాథ్ తదితరులు కీలకపాత్రను పోషించబోతున్నారు. మొత్తానికి తన కొడుకుని హీరోగా చేయాలనుకున్న కలను నెరవేర్చుకోబోతోంది. మరి హీరో అనిపించుకుని తన తల్లి కోరికను ఆకాష్ నిలబెడతాడేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version