రాఘవేంద్రరావు మెచ్చిన పంచతంత్ర కథలు.. చిత్రం ఎలా ఉందంటే..?

-

దర్శక ధీరుడు రాఘవేంద్రరావు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఎంతోమంది స్టార్ హీరోలను, హీరోయిన్లను ఒక పొజిషన్ కి తీసుకొచ్చిన ఘనత రాఘవేంద్రరావుకి దక్కుతుంది అని అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా తన సినిమాల కంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ను కూడా ముద్రించుకున్నారు. ఇదిలా ఉండగా మధు క్రియేషన్స్ పతాకం పై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా ప్రముఖ వ్యాపారవేత్త డి మధు నిర్మించిన తాజా చిత్రం పంచతంత్ర కథలు . అయితే C/O కంచర్లపాలెం సినిమా కథను ఆదర్శంగా తీసుకొని పంచతంత్ర కథలు అనే సినిమాను తెరకెక్కించారు. ఇకపోతే పంచతంత్ర కథలు అనేది ఐదు జంటల కథలను ఆధారంగా తీసుకొని ఈ సినిమాలో చాలా అద్భుతంగా చిత్రీకరించారు.

ఇందులో నటీనటులుగా నోయల్, సాయి రోనక్, నందిని రాయ్ , అజయ్ కతుర్వర్ , గీతా భాస్కర్, నిహాల్ కోదర్తి, ప్రణీత పట్నాయక్, సాదియా వంటి వారు ఈ సినిమాలో కీలకపాత్రను పోషించారు. ఇకపోతే ఐదు కథల సమూహారంగా రూపొందిన ఈ చిత్రాన్ని గంగనమోని శేఖర్.. దర్శకుడిగా ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. డైరెక్ట్ గా ప్రముఖ ఓటీటీ ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా విపరీతమైన ప్రేక్షక ఆదరణ పొందుతోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ చిత్రాన్ని ప్రశంసించారు. ఇక ఈ క్రమంలోని దర్శకుడు కే రాఘవేంద్రరావు కూడా ఈ సినిమాను వీక్షించి సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు..

ఆయన మాట్లాడుతూ.. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న పంచతంత్ర కథలు సినిమా చూశాను.. సినిమా గురించి ఐదు మాటల్లో చెప్పాలనిపిస్తోంది అంటూ చెబుతూనే.. దర్శకుడు , కెమెరామెన్ ఒకరే కనుక చిత్రీకరణ కూడా చాలా అద్భుతంగా ఉంది. మంచి మాటలు, మ్యూజిక్, సెలక్షన్ ఆఫ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా చక్కగా కుదిరాయి.

అహల్య అనే మరో షార్ట్ స్టోరీ లో తన బిడ్డను పోషించుకోవడం కోసం వ్యభిచారినిగా మారిన అమ్మాయి, పెయింటర్ మధ్య జరిగే ఎపిసోడ్ చాలా అద్భుతంగా చిత్రీకరించారు.

ఇక కుల వ్యవస్థ గురించి పెద్ద కులం, చిన్న కులం కాకుండా ప్రేమకు కులాలు అడ్డు రావు అంటూ చాలా సున్నితంగా అంశాన్ని తెరకెక్కించారు. తరుణ్ భాస్కర్ తల్లి గీతా భాస్కర్ ఇద్దరు కొడుకులు ఉండడంతో ఏ ఇంట్లో ఉండాలి అనే విషయం చాలా సున్నితంగా ఆలోచింపచేసే విధంగా తెరకెక్కించారు. ఇక ఈ చిత్రాన్ని తెరకెక్కించిన నిర్మాత మధుకి కూడా నా అభినందనలు .. ఇక మునుముందు కూడా ఇలాంటి మంచి సినిమాలు ఎన్నో తీయాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పారు రాఘవేంద్రరావు.

Read more RELATED
Recommended to you

Latest news