సాక్షి దినపత్రికకు, సీఐడీకి ఉన్న సంబంధం ఏమిటి? – RRR

-

సాక్షి దినపత్రికకు, సీఐడీ పోలీసులకు ఉన్న సంబంధం ఏమిటని?, సాక్షి దినపత్రిక రాష్ట్ర ప్రభుత్వానికి మౌత్ పీసా?, రాష్ట్ర ప్రభుత్వాన్ని సాక్షి దినపత్రికనే శాసిస్తోందా??, సాక్షి దినపత్రికలో ఏదైనా వార్త ప్రచురిస్తే, అది రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టేనా?? అంటూ రఘురామకృష్ణ రాజు గారు శర పరంపరగా ప్రశ్నోస్త్రాలను సంధించారు. రామోజీరావు గారిని సీఐడీ పోలీసులు విచారిస్తున్న ఫోటో బయటికి ఎలా వచ్చిందన్న దానిపై ముందు సీఐడీ పోలీసులు విచారణ చేపట్టాలని, సాక్షి దినపత్రిక యాజమాన్యాన్ని ప్రశ్నించాలని అన్నారు. రామోజీరావు గారికి మద్దతుగా మాట్లాడడాన్ని ప్రశ్నిస్తూ వివరాలు తెలియజేయాలని సీఐడీ, సాక్షి దినపత్రిక ఉడత ఊపులకు బెదిరిపోయేవారు ఎవరూ లేరని అన్నారు.

సీఐడీ పోలీసులు తమ పరిధి ఏమిటో ముందు తెలుసుకుని నడుచుకోవాలని, సీఐడీ పోలీసులు ప్రజల కోసం న్యాయస్థానాలు ఉన్నాయన్న విషయాన్ని విస్మరిస్తున్నట్లుగా కనిపిస్తోందని అన్నారు. తమ ప్రాథమిక హక్కులను కాపాడుకోవడానికి అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం అని, సాక్షి దినపత్రికలో చట్టానికి రామోజీరావు అతీతుడా? అనే శీర్షికతో అర పేజీ కథనం ప్రచురించిందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో చేసిన చిట్ ఫండ్ చట్టాలు వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేసినవి కావని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

గత ప్రభుత్వాల హయాంలో చేసినవనే విషయము అందరికీ తెలిసిందేనని, అయినా చిట్ ఫండ్ చట్టాలను ఉల్లంఘించి ఎన్నో చిట్ ఫండ్ కంపెనీలు గత కొంతకాలంగా రాష్ట్రంలో మూతబడ్డాయని, అటువంటి కంపెనీలపై రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నదో శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని రఘురామకృష్ణ రాజు గారు డిమాండ్ చేశారు. రామోజీరావు గారికి వ్యతిరేకంగా తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని సీఐడీ చెప్పినట్లుగా సాక్షి దినపత్రిక పేర్కొందని, అన్ని ఆధారాలు ఉన్నప్పుడు, ఆలస్యం ఎందుకు చేస్తున్నారు… తక్షణమే చార్జిషీట్ ను దాఖలు చేయవచ్చు కదా? అని ఆయన ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news