ఏపీ సీఎం జగన్‌కు వైసీపీ రెబల్ ఎంపీ రఘరామ కృష్ణం రాజు మరో షాక్ ఇచ్చారు. సీఎం జగన్ ఆస్తుల కేసులపై హైకోర్టులో ఎంపీ రఘురామ కృష్ణరాజు మరో పిల్ దాఖలు చేశారు. జగన్ ఆస్తుల కేసులను సీబీఐ, ఈడీ సరిగా దర్యాప్తు చేయడం లేదని పిల్ వేశారు రఘరామ కృష్ణరాజు. దర్యాప్తులో దృష్టికి వచ్చిన పలు అంశాలను వదిలిపెట్టాయని రఘురామ ఆరోపణలు చేశారు.
కేసులకు తార్కిక ముగింపు ఇవ్వడంలో సీబీఐ, ఈడీ విఫలమయ్యయాన్న రఘురామ… గుర్తించిన అన్ని అంశాలపై దర్యాప్తు చేసేలా సీబీఐ, ఈడీని ఆదేశించాలని కోరారు. ఇది ఇలా ఉండగా… సీఎం జగన్ మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై జులై 1న సీబీఐ కోర్టు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సందర్భంగా సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ రద్దు పిటిషన్‌పై లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని సీఎం జగన్ మోహన్‌రెడ్డి, ఎంపీ రఘురామ కృష్ణంరాజు లను సీబీఐ కోర్టు ఆదేశించింది.