రెండు రోజుల్లో చంద్రబాబు విడుదల – RRR

-

నాలుగో విడత వారాహి యాత్రను పవన్ కళ్యాణ్ గారు అవనిగడ్డ నుంచి ప్రారంభించారని, మరికొన్ని ప్రాంతాలలో ఆయన పర్యటన కొనసాగనుందని, ఒకటి రెండు రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి విడుదలై కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత కదనరంగంలోకి దిగనున్నారని అన్నారు. లోకేష్ గారు కూడా తన యువ గళం యాత్రను కొనసాగించనున్నారని, దీనితో తమ పార్టీ పని కథ కంచికే అని అన్నారు. తాను తప్ప తమ పార్టీ వాళ్లంతా ఇంటికేనని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు.

తమ పార్టీ నాయకులు చేసే పనికిమాలిన పనులను చంద్రబాబు నాయుడు గారు అడ్డుకునే ప్రయత్నాన్ని చేసి ఉండకపోతే, ఆయనపై స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ లో స్కామ్ అంటూ అక్రమ కేసు నమోదు చేసి ఉండేవారు కాదని, తమ పార్టీ వాళ్లు దొంగ ఓట్లను నమోదు చేస్తుండగా, ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లారని, తాను కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాశానని అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రతిపక్ష నాయకులు ఎక్కడికక్కడ అప్రమత్తమయ్యారని, మచిలీపట్నంలో దొంగ ఓట్ల నమోదును స్థానికులు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారని తెలిపారు. విశాఖపట్నంలో దొంగ ఓట్ల నమోదు ప్రక్రియను రామకృష్ణ బాబు, విష్ణుకుమార్ రాజు లు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లారని, ప్రకాశం జిల్లాలో 20 మంది వ్యక్తులు సుమారు 70 నుంచి 80 మంది ఓట్లను తొలగించాలని ఫామ్ 7 దాఖలు చేశారని, వారు తమ ఫోన్ నెంబర్లని ఇచ్చుకోవడాన్ని ఏలూరు సాంబశివరావు గుర్తించారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news