నేచురల్ స్టార్ నాని, మహానటి ఫేం కీర్తి సురేశ్ దసరా మూవీ కోసం రెండో సారి జత కట్టిన విషయం తెలిసిందే. మార్చి 30వ తేదీన ఈ సినిమా దేశవ్యాప్తంగా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల అయింది. ఇక ఇప్పటికి ఈ సినిమా మంచి టాక్ తో ముందుకు సాగుతోంద. ఈ తరుణంలోనే.. దసరాపై రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. రఘురామకృష్ణం రాజు మాట్లాడుతూ నేను రీసెంట్ గానే దసరా సినిమా చూశాను.
ఆ సినిమా బ్యాక్ డ్రాప్ మద్యం ఓ ఊరిని పాడు చేస్తుంటుంది. ఆ ఊర్లో మద్యాన్ని తీసేస్తానన్న వాడు ఓడిపోతాడు. మద్యంతో పాటు దాంతో పాటు అడ్వాన్స్ గా డబ్బులు కూడా ఇస్తానని చెప్పిన వాడిని ప్రజలు గెలిపిస్తారు. అయితే దాని పర్యావసానం కూడా సినిమాలో చూపించారు. అందుకు కారణం చీప్ లిక్కర్. ఆ సినిమాలో చూపించిన లిక్కర్ సెంటర్ పేరు సిల్క్ లిక్కర్ సెంటర్. అక్కడ మందు తాగటం వల్ల ఊర్లో మగవాళ్లు సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. ఆడవాళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇలాంటి చెత్త సరుకు అమ్మి ప్రజల ప్రాణాలు తీసి మగవారి సంఖ్య తగ్గించి ఆడవారి సంఖ్య పెరిగిపోయేలా చేస్తున్నారని చివరకు ప్రజల్లో దీనిపై చైతన్యం వస్తుంది. ఇలాంటి వారిని ఎన్నుకుని తప్పు చేశామని, తదుపరి ఎన్నికల్లో వారిని ఓడిస్తారు. అప్పటివరకు వారిపై చేసిన అఘాయిత్యాలకు తిరగబడతారు. ఇక సినిమా అన్న తర్వాత ఫైటింగ్స్ ఉంటాయి కాబట్టి చంపేస్తారు.