అమరావతి నుంచి రాజధానిని తరలించవద్దంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న పోరాటానికి 200 రోజులు పూర్తి అయిన సందర్భంగా పలువురు నేతలు, ప్రముఖులు, సంఘసంస్కర్తలు వారికి మద్దతు తెలుపుతున్నారు. వారి పోరాట ప్రతిభను అభినందిస్తున్నారు. తాజాగా రైతులు చేస్తున్న పొరటంపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు.. రాజధాని రైతులకు సంఘీభావాన్ని ప్రకటిస్తున్నానని అన్నారు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని నిండు సభలో నాడు జగన్ చెప్పారని…
వైసీపీ మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా ఇదే అన్నారని ఆయన గుర్తు చేశారు. అలాగే, రాజధానిగా అమరావతి కొనాసాగాలనేదే తన వ్యక్తిగత అభిప్రాయామని రఘురాజు అన్నారు. రాజధాని అంశంపై ప్రజల అభిప్రాయాన్ని తీసుకోవాలని… ప్రభుత్వానికి ఇదే తన విన్నపమని చెప్పారు. ప్రజా నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. అసలు మూడు రాజధానుల అంశం వైసీపీ మేనిఫెస్టోలో లేదని.. కాబట్టి, ప్రభుత్వం వెంటనే మూడు రాజధానుల అంశాన్ని వెనక్కి తీసుకుని.. ప్రజలకి న్యాయం చేయాలని ఆయన కోరారు.