Breaking : భయపడే సావర్కర్‌ ప్రాణ భిక్ష కోరారు : రాహుల్‌ గాంధీ

-

బీజేపీ అభిమాన నేత వీర్ సావర్కర్ భారత్ స్వాతంత్రం కోసం పోరాడుతున్న సమయంలో బ్రిటీషర్లతో ఎలా వ్యవహరించాడన్న దాన్ని బయటపెట్టేలా ఉన్న ఓ లేఖను రాహుల్ గాంధీ ఇవాళ బయటపెట్టారు. ఈ లేఖను సావర్కర్ స్వయంగా బ్రిటీషర్లకు రాశాడు. ఈ లేఖలో సావర్కర్ చేసిన వ్యాఖ్యలు భారత్ కు వ్యతిరేకంగా ఉన్నాయని, ముఖ్యంగా అప్పట్లో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతున్న భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు గాంధీ, నెహ్రూ, పటేల్ ను మోసం చేసేలా ఉన్నాయని రాహుల్ తెలిపారు. భారత స్వాతంత్ర సంగ్రామం సాగుతున్న సమయంలో వీర్ సావర్కర్, బ్రిటీష్ వారికి రాసిన లేఖలో, “సర్, నేను మీకు అత్యంత విధేయుడైన సేవకుడిగా ఉంటానని వేడుకుంటున్నా” అని ఉంది. అలాగే దానిపై ఆయన సంతకం కూడా ఉంది.

Vision of Savarkar vs vision of Gandhi': Rahul Gandhi dares Maharashtra  govt to stop Bharat Jodo Yatra - India Today

సావర్కర్ బ్రిటిష్ వారికి సహాయం చేశాడు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్ వంటి నాయకులకు భయంతో లేఖపై సంతకం చేసి మోసం చేశాడని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తెలిపారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఓ ట్వీట్ చేశారు. అనంతరం వీర సావర్కర్ పై రాహుల్‌ గాంధీ విమర్శలు చేశారు. భారతీయ జనతా పార్టీకీ, ఆరెస్సెస్‌కు ఆయనో చిహ్నమని, బ్రిటీషర్ల నుంచి పింఛన్‌ తీసుకుంటూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేశారని వెల్లడించారు. భయపడే సావర్కర్‌ ప్రాణ భిక్ష కోరారన్నారు రాహుల్‌ గాంధీ. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు. చరిత్రను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
Breaking News, Latest News, Rahul Gandhi, Savarkar, BJP, Congress

Read more RELATED
Recommended to you

Latest news