సుదీర్, రష్మిల జోడి తో సినిమా.! సూపర్ హిట్ గురూ.!

-

తెలుగు ప్రజలకు టెలివిజన్ లో ఎంతో దగ్గర అయిన షోలు జబర్దస్త్ మరియు  ఎక్స్ట్రా జబర్దస్త్. ఇప్పటి వరకు వీటి రేటింగ్స్ ను కొట్టే షో లు రాలేదంటే వీటిని స్టామినా అర్దం చేసుకోవచ్చు. అంతలా ఈ షోస్ తెలుగు ప్రజలను అలరిస్తూ వస్తున్నాయి. ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్స్ ఇటు టీవీ కి మరియు సినిమాకు పరిచయమయ్యారు. 

అలాగే ఈ షోలలో సుదీర్ మరియు రష్మిల జోడి హంగామా చెప్పాల్సిన పనిలేదు. ఇక వీరిద్దరూ కలిసి స్టేజ్ మీద ఉంటే చాలు హార్ట్ సింబల్ వేసి మాంచి లవ్ సాంగ్ వేసి హంగామా చేస్తూ ఉంటారు. ఇక ఆ వీడియోస్ తో టీవీ ఛానెల్స్ మరియు యూట్యూబ్ ఛానెల్స్ హడావుడి చెస్తూ రేటింగ్స్, వ్యూస్ పెంచుకుంటూ ఉంటారు.

ఈ జంటకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . అయితే ఇప్పటివరకు బుల్లితెరపై ఓ రేంజ్ లో అలరించిన ఈ జంట.. త్వరలోనే వెండితెరపై కూడా నటించబోతున్నట్లు ఓ న్యూస్ ఫైనల్ గా మారింది. దీనితో సుధీర్ – రష్మీ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఈ వార్త విని సినిమా అధికారిక  ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news