దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఉన్న విషయం దాదాపు అందరికీ తెలిసిందే. మొత్తం దేశవ్యాప్తంగా దశల్లో ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మొదటి దశ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం కూడా ముగిసింది. రెండో దశ ఎన్నికల్లో పలువురు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. తాజాగా 2024 పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ రాహుల్ గాంధీ మరోసారి వయనాడ్ నుంచి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. 2019 ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ.. అమోతీలో ఓడిపోయి.. వాయనాడ్ లో బంపర్ మెజార్టీతో గెలుపొందాడు.
అయితే పొత్తులో భాగంగా వయనాడ్ సీటును కేరళ సీపీఎం పార్టీ సీపీఐ అభ్యర్థి, అన్ని రాజాకు కేటాయించింది. అయినప్పటికి రాహుల్ గాంధీ మరోసారి వయనాడ్ నుంచి పోటీలో ఉన్నారు. ఈ క్రమంలోనే నేడు వయనాడ్ పట్టణంలో భారీ రోడ్ షో నిర్వహించి.. నామినేషన్ దాఖలు చేశారు. కాగా కేరళలో 20 లోక్ సభ స్థానాలు ఉండగా.. మొదటి దశలో మొత్తం 20 స్థానాలకు ఏప్రిల్ 19న ఓటింగ్ జరగనుంది. వీటి ఫలితాలు జూన్ 4న వెలువడుతాయి.