స్నేహితుల కోసమే ఈ ముసాయిదా : రాహుల్ గాంధీ

-

పర్యావరణ ప్రభావ మదింపు(ఈఐఏ)-2020 పేరిట కేంద్రం తీసుకొస్తున్న ముసాయిదాపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశాన్ని దోచుకోవడమే ముసాయిదా లక్ష్యమని దుయ్యబట్టారు. ఈ ముసాయిదాను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ నూతన ముసాయిదాకు వ్యతిరేకంగా నిరసన చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు రాహుల్. ముసాయిదాను ప్రమాదకరమైనదిగా అభివర్ణించారు. దీని వల్ల భవిష్యత్తులో విపత్కర పరిస్థితులు తలెత్తుతాయని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

Rahul Gandhi
Rahul Gandhi

దేశంలో అభివృద్ధి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతుల ప్రక్రియలో మార్పు చేయడంలో భాగంగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పర్యావరణ ప్రభావ మదింపు ముసాయిదాను రూపొందించింది. ప్రాజెక్టు, పరిశ్రమలకు భూసేకరణ పూర్తి చేయకుండానే పర్యావరణ అనుమతులు మంజూరు చేసే విధంగా కొత్త ముసాయిదాలో వీలు కల్పించారు. ప్రజాభిప్రాయ సేకరణ, ప్రజల నుంచి సూచనలను, వినతులను తీసుకునే ప్రక్రియకు కేవలం 20 రోజులే గడువిచ్చారు. దీనిపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news