బ్రేకింగ్; టీ కాంగ్రెస్ కి హైకోర్ట్ షాక్, మీకు ఆ అధికారం లేదు…!

-

సచివాలయం కూల్చివేతల పరిశీలనకు అనుమతించాలన్న కాంగ్రెస్ నేతల పిల్ పై హైకోర్టులో విచారణ జరిగింది. రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, కొండా విశ్వేశ్వరరెడ్డి దాఖలు చేసిన పిల్ పై విచారణ జరిగింది. తమ దరఖాస్తులపై డీజీపీ, సీపీ స్పందించడం లేదని కాంగ్రెస్ నేతలు హైకోర్ట్ దృష్టికి తీసుకెళ్ళారు. కాంగ్రెస్ నేతల దరఖాస్తులపై ఏం చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు.

telanaga high court

ఏజీ క్వారంటయిన్ లో ఉన్నందున రెండు వారాల గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది హైకోర్ట్ కి తెలిపారు. పురాతన ఆలయం, మసీదు పొరపాటున కూలి పోయాయని ప్రభుత్వం చెబుతోందన్న కాంగ్రెస్ నేతల తరుపు న్యాయవాది హైకోర్ట్ దృష్టికి తీసుకువెళ్ళారు. పొరపాటున జరిగిందా? ఉద్దేశ పూర్వకంగా కూల్చారా పరిశీలిస్తామన్న కాంగ్రెస్ నేతలకు హైకోర్ట్ షాక్ ఇచ్చింది. దర్యాప్తు చేసే అధికారం ప్రజా ప్రతినిధులకు లేదని స్పష్టం చేసింది హైకోర్టు. విచారణ జరపాలని పురావస్తు శాఖను కోరడానికి అడ్డంకి ఏమిటని హైకోర్ట్ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ఇచ్చింది. విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది

Read more RELATED
Recommended to you

Latest news