RRR సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు రూ. 10 లక్షల రివార్డ్ !

-

జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ మరియు రాజమౌళి ల కాంబోలో వచ్చిన పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ ఎంత ఘనవిజయాన్ని అందుకుందో తెలిసిందే. పైగా తొలిసారి భారతదేశ చరిత్రలో ఆస్కార్ అవార్డును అందుకున్న తొలిచిత్రంగా రికార్డును సృష్టించింది. ఇందులో “నాటు నాటు” అనే పాటకు అవార్డు దక్కడం గర్వించదగ్గ విషయం. కాగా ఈ పాట తెలుగు వెర్షన్ ను పాడింది మన తెలంగాణ తెలుగు సింగర్ రాహుల్ సిప్లిగంజ్. కాగా తాజాగా ఆస్కార్ అవార్డు రావడానికి ఒక కారణం అయిన రాహుల్ సిప్లిగంజ్ టాలెంట్ ను మెచ్చుకున్న తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రూ. 10 లక్షల నగదు బహుమతిని ప్రకటించారు.

ఇది మాత్రమే కాకుండా వచ్చే ఎన్నికలో కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే రూ. కోటి నగదు బహుమతి ఇస్తామని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో పుట్టి అంతర్జాతీయ స్థాయికి ఎదగడంలో రాహుల్ కృషి ఎంతో ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news