రైల్వే శాఖ కీలక అడుగు, 40 వేల ఐసోలేషన్ బెడ్స్..!

-

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక రూపంలో కరోనా వ్యాప్తి చెందుతూనే ఉంది. ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లిన వారికి ఈ వైరస్ సోకడంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. ఐసోలేషన్ వార్డులను, క్వారాంటైన్ కేంద్రాల సంఖ్య అన్ని చోట్ల పెంచుతున్నారు. ఈ కరోనా ఏ క్షణం లో ఎలా ముంచుకు వస్తుందో తెలియట్లేదు, కాబట్టి ముందే అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం అన్ని రకాలుగా ఈ వైరస్ ను అరికట్టేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది.

ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రయత్నంలో తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. రైల్వే శాఖ నుండి కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. కరోనా బాధితులకు చికిత్స కొరకు రైల్వే కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మార్చుతుంది రైల్వేశాఖ. ఇప్పటి వరకు 2500 రైల్వే కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మార్చినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. దాదాపు 40వేల ఐసోలేషన్ బెడ్స్ ఆ కోచ్ లలో సిద్ధం చేసినట్లు తెలిపింది.

రోజుకు సగటున 375 కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మార్చుతున్నట్లు, అంతే కాకుండా ఆస్పత్రుల్లో ఉండే అన్ని వైద్య సదుపాయాలు వీటిలో ఉంటాయని రైల్వే శాఖ ప్రకటించింది. ఆ రైళ్లను దేశవ్యాప్తంగా ఆయా రైల్వే మండళ్లకు చేరవేస్తున్నట్లు రైల్వేమంత్రి పీయుష్ గోయెల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.దేశంలో కరోనా కేసులు నాలుగు వేలు దాటగా మరణాలు వంద దాటాయి.

Read more RELATED
Recommended to you

Latest news