ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ కారణంగా ఎందరో ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా కూలీలు, రైతులు ఇలా ప్రతీ ఒక్కరు ఇబ్బందులు పడుతున్నారు. పూట ఎలా గడుస్తుందో అర్ధం కాక నరకం చూస్తున్నారు. పిల్లలు ఉన్న వారి పరిస్థితి ఇప్పుడు మరీ దారుణంగా ఉంది. ఇప్పుడు వారికి అండగా నిలవాలని సిఎం జగన్ ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక డిమాండ్ పెట్టారు.
ఆ డిమాండ్ ఏంటీ అంటే… ఏపీలో పరిస్థితులు భయానకంగా ఉన్నాయని తాజాగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్‌తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో పనిచేస్తే గానీ, పూటగడవని ఎంతోమంది పేదలున్నారని… వారందరినీ ఏవిధంగా ఆదుకోవాలో ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ సాయానికి అదనంగా కొన్ని రాష్ట్రాలు ఆర్థిక ప్యాకేజీ ఇచ్చాయని పేర్కొన్నారు.
ఢిల్లీ ప్రభుత్వం రూ.5వేలు ఇస్తోందన్న చంద్రబాబు… ఏపీలోనూ పేదలకు తొలివిడతగా కనీసం రూ.5వేలు చొప్పున ఇచ్చి ఆదుకోవాలని జగన్ ని డిమాండ్ చేసారు. రేషన్, పింఛన్లలో అనేకమందికి కోత విధించడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మీడియా తో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 266 మందికి కరోనా వైరస్ సోకింది.