వింత రైల్వే స్టేషన్‌.. అదేంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

-

ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌ లలో ఒకటైన ఇండియన్ రైల్వేలో ఒక్కో రైల్వే స్టేషన్‌ ఒక్కో ప్రాంతానికి చెందినది ఉంటుంది. రాష్ట్రాల వారీగా, ప్రాంతాల వారీగా వీటి పేర్లు ఉంటాయి. అయితే ఎవరికి తెలియని ఒక వింత రైల్వే స్టేషన్‌ మన భారతదేశం లో ఉంది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ తెలియజేశారు. ఇటీవల పియూష్ గోయల్ తన ట్విట్టర్‌లో షేర్ చేసిన నవాపూర్ రైల్వే స్టేషన్‌ ఫోటో వైరల్‌ అవుతోంది.

ఈ స్టేషన్ గురించి తెలుపుతూ..”దేశంలో రెండు రాష్ట్రాల్లోనూ ఉన్న ఓ రైల్వేస్టేషన్ గురించి తెలుసా? సూరత్‌-భుసావల్ మార్గంలోని నవాపూర్ రైల్వే స్టేషన్ ఇది. రెండు రాష్ట్రాల సరిహద్దులు ఈ స్టేషన్ మధ్య నుంచి వెళ్తున్నాయి కాబట్టి ఈ స్టేషన్ సగం గుజరాత్‌లోనూ, సగం మహారాష్ట్రలోనూ ఉంది” అని పేర్కొన్నారు. రైల్వే శాఖ మంత్రి పెట్టిన ఆ పోస్ట్‌కు లైకులు, షేర్లు చేస్తూ నెటిజన్స్ తమ స్పందన తెలియజేస్తుండగా, దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news