సాధారణంగా మనం మార్కెట్ నుండి బంగాళదుంపలు కొనుగోలు చేసి ఇంటికి తీసుకు వస్తాం. అలా తీసుకు వచ్చిన బంగాళాదుంపలను ఎప్పుడో చేయబోయే వంట కోసం ఓ మూలన పెడతాం. అయితే ఒక్కోసారి వంట చేసే సమయానికి బంగాళాదుంపలకు మొలకలు వచ్చి ఉండడం గమనిస్తాం. అలాంటివి ఏకంగా మూడు నెలలు గడిస్తే మొలకలు ఎంత పెద్దగా అయిపోతాయో మీరు ఇట్లే అర్థం చేసుకోవచ్చు. అవును ఇలాంటి సంఘటనే ఓ మహిళ ఇంట్లో జరిగింది.
అసలు విషయంలోకి వెళ్తే… ఫ్రాన్స్ కు చెందిన డన్నా పారీ అనే మహిళ బంగాళదుంపలను కొని ఇంట్లో పెట్టింది. అయితే ఇక కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ఆమె తన స్నేహితురాలు ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకొని, వస్తువులన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయింది. అయితే ఆమె కొని ఉంచిన బంగాళాదుంపలను అక్కడే వదిలేసి వెళ్ళింది. అయితే మూడు నెలల తర్వాత తిరిగి వచ్చిన ఆమె తన కిచెన్ లోకి వెళ్లి చూసి షాక్ కు గురైంది. నిజానికి ఆమె కిచెన్ లో గోడకు మొక్కలు మొలిచాయి. ఆ మొక్కలు ఎక్కడివని అనుకుంటున్నారా…? తాను కొని ఉంచిన బంగాళా దుంపల నుంచి వచ్చినవి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆమె కొని తెచ్చుకున్న బంగాళాదుంపలు గుర్తుకు వచ్చాయి. దీంతో ఆమె ఒకింత ఆనందపడి, ఆ మొక్కలను ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అవి కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.
Après 3 mois d’absence mes pommes de terre ont décidé de pousser sans limite jusqu’à faire des trous dans les joints pic.twitter.com/LBcKBNAhMK
— 𝒹𝓸𝒹𝓸 (@donna9p) June 12, 2020