ఆంధ్రప్రదేశ్ కు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ ను ప్రకటించింది. బంగాళాకాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దాని ప్రభావంతో ఏపీలో రాగల 48గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఇక వాయుగండం ప్రభావంతో ఉత్తర తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇక ఏపీలో గంటకు 40 నుండి 50 కిమీల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి.
దాంతో సముద్రం అల్లకల్లోలంగా ఉందని చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. అంతే కాకుండా తీర ప్రాంతాల వాసులకు అలర్ట్ ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ఇల్లలో నుండి బయటకు రావద్దని సూచించింది. ఇక ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు రేపు కూడా వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరికలు రావడంతో సీఎం జగన్ పలు జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.