తెలంగాణలో రేపు ఎల్లుండి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. ఈశాన్య భారత్ వైపు నుండి తెలంగాణ వైపుకు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. దాంతో నేడు రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుందని రేపు, ఎల్లుండి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
అంతే కాకుండా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఊష్ణోగ్రతలు మూడు నుండి నాలుగు డిగ్రీలు అధికంగా నమోదు అవుతున్నట్టు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా నిన్న సంగారెడ్డి జిల్లా నల్లవెల్లిలో అత్యల్పంగా పదమూడు డిగ్రీల ఊష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఇక రాష్ట్రంలో ప్రస్తుతం రోజంతా ఎండలు దంచికొడుతుండగా సాయంత్రం అయ్యిందంటే చలి మొదలవుతోంది. ఆదిలాబాద్ మరికొన్ని జిల్లాలో చలి తీవ్రత పెరగటం తో ప్రజలు వనికిపోతున్నారు.