తెలంగాణ వాసులకు అలర్ట్‌… ఆగస్టు 1 వరకూ వర్షాలే.. వర్షాలే..

-

తెలంగాణను వర్షాలు వీడనంటున్నాయి. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు గ్రామాలు ముంపుకు గురయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని చోట్ల చెరువులకు గండిపడి నీరంతా గ్రామాల్లోకి వచ్చి చేరుతోంది. భారీ వర్షాల కారణంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అయితే.. రాష్ట్రంలో ఆగస్టు ఒకటి వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ తెలిపింది వాతావరణ కేంద్రం.

Rains with heavy winds to lash Hyderabad for next 12 hours

భారీ వర్షాల తీవ్రత తగ్గిందని, ఇప్పటికే 94 శాతం అధికంగా వర్షాలు పడ్డాయని పేర్కొన్నది వాతావరణ శాఖ. శనివారం పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది. రాగల 48 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొన్నది వాతావరణ శాఖ.

 

Read more RELATED
Recommended to you

Latest news