ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దాంతో రానున్న 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అంతేకాకుండా తెలంగాణలో భారీ వర్షాలు.. కోస్తా జిల్లాలలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
అయితే ఇప్పటికే కురిసిన వర్షాలతో ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి…దాంతో ప్రాజెక్టుల గేట్లను ఎత్తివేసి నీటిని బయటకు వదిలారు. ఇక తాజాగా మరోసారి భారీ వర్ష సూచన ఉండడంతో పలు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టులకు దిగువన నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే వారు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మరోవైపు సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.