నిన్న మొన్నటి వరకు భరించలేని ఎండలు మనుషులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. అయితే ఎండాకాలం ముగుస్తుండగానే అప్పాయుడే వర్షాకాలం మనల్ని భయబ్రాంతులకు గురి చేయడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పాలి. తెలుస్తున్న సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు మరియు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని హైద్రాబాద్ వాతావరణ శాఖ రిపోర్ట్ తెలిపింది. ఈ రిపోర్ట్ ప్రకారం తెలంగాణ లోని నల్గొండ , సూర్యాపేట, యాదాద్రి, రంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాలతో కలుపుకుని ఉత్తర తెలంగాణ లో సైతం చాలా చోట్ల వర్షాలు పడనున్నాయని సమాచారం. ఇక రానున్న రెండు రోజుల్లో అయితే వర్షాలు భీభత్సాన్ని సృష్టిస్తాయని తెలుస్తోంది.
దీనిని బట్టి తెలంగాణ ప్రజలు పడనున్న వర్షాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని తెలుస్తోంది. అందుకు తగిన విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలను తీసుకుంటోంది.