రానున్న మూడు రోజుల్లో మళ్ళీ వర్షాలు..!

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారీగా పంట నష్టం వాటిల్లడంతో పాటు ఎన్నో ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు వరదల నుంచి కోలుకుంటున్న విషయం తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో మరోసారి హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు.

మూడు రోజుల్లో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం కూడా ఉందని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రేపు ఎల్లుండి ఉత్తర కోస్తాంధ్రలో పొడి వాతావరణం ఉండడంతోపాటు నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అంతే కాకుండా మరికొన్ని జిల్లాల్లో కూడా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.