మాస్ గోలలో పడి సెల్ఫ్ గోల్ చేసుకుంటున్న యంగ్ హీరో…!

-

బెల్లంకొండ శ్రీనివాస్‌కి ఇప్పటివరకు మాస్‌ మూవీస్‌ కలిసిరాలేదు. ఎంత పెద్ద డైరెక్టర్‌తో సినిమా చేసినా, మాస్‌ హిట్‌ మాత్రం రాలేదు. అయినా బెల్లంకొండ మాత్రం మారట్లేదు. ఇప్పటికీ మాస్‌ లుక్కులిస్తూనే ఉన్నాడు. దీంతో ఈ మాస్‌ గోలలో పడి బెల్లంకొండ సెల్ఫ్‌ గోల్‌ చేసుకుంటున్నాడనే కామెంట్స్‌ వస్తున్నాయి.బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ మాస్‌ మూవీతోనే ఎంట్రీ ఇచ్చాడు. వి.వి.వినాయక్ డైరెక్షన్‌లో “అల్లుడు శీను’గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ఈ సినిమా కాస్ట్‌ఫెయిల్యూర్‌ అయ్యిందని ట్రేడ్‌ టాక్.

ఆ తర్వాత బోయపాటి శ్రీనుతో “జయజానకినాయక’ చేశాడు. ఇదీ వర్కవుట్‌ కాలేదు. ఇక శ్రీవాస్‌ డైరెక్షన్‌లో చేసిన “సాక్ష్యం’ అయితే బెల్లంకొండని మరింత ముంచింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ జర్నీలో ఫస్ట్‌టైమ్ పాజిటివ్‌ రెస్పాన్స్‌ తెచ్చుకున్న సినిమా “రాక్షసుడు’. రెగ్యులర్‌ కమర్షియల్‌ హీరోయిజానికి దూరంగా వచ్చిన ఈ సినిమాతో బెల్లంకొండ కొంచెం మారాడనే టాక్ కూడా వచ్చింది. కానీ రీసెంట్‌ ఫోటోషూట్‌తో ఈ హీరో ఇంకా మాస్ మాయలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. కమర్షియల్ హీరో మాయలోపడి కెరీర్‌ని ప్రమాదంలోకి తీసుకెళ్తున్నాడని కామెంట్ చేస్తున్నారు జనాలు.

Read more RELATED
Recommended to you

Latest news