ఇటీవల కాలంలో భారీ వర్షాలు దక్షిణాది రాష్ట్రాలను భయపెడుతున్నాయి. తమిళనాడు, ఆంద్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా చెన్నై మహానగరం చెరువును తలపించింది. భారీ వర్షాల కారణంగా చెన్నైలోని రోడ్లు నదులను తలపించాయి. వారం పాటు జనాలు ఇళ్లకే పరిమితమవ్వాల్సి వచ్చింది. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూర్ ను కూడా వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.
బెంగళూరులో కూడా ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కర్ణాటక రాజధాని నగరంలో నవంబర్ 24 నుండి నవంబర్ 26 వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయని హెచ్చిరించింది. రాబోయే 5 రోజులలో కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్‌లో తేలికపాటి నుండి మోస్తరుగా చెదురుమదురు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయి. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ మరియు కేరళ & మహేలలో వచ్చే 5 రోజులలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చిరించింది.
భారీ వర్షాల కారణంగా బెంగళూరు వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని యలహంక, భవానీ నగర్ ప్రాంతంలోని పలు అపార్ట్‌మెంటుల్లోకి వరద నీరు చేరింది. బృహత్ బెంగళూరు మహానగర పాలికే పరిధిలోని RR నగర్, మహదేవపుర, దాసరహళ్లి ప్రాంతాల్లో కూడా వరద నీరు చేరింది. ఇళ్లు కూలిన వారికి లక్ష రూపాయల పరిహారం ఇస్తామని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. కర్ణాటక ప్రభుత్వం రోడ్లు మరియు వంతెనల కోసం రూ. 500 కోట్లు విడుదల చేసింది. నగరం చుట్టూ ఎమర్జెన్సీ రెస్క్యూ టీమ్‌లను ఏర్పాటు చేసింది.