తెలంగాణ వరి ధాన్యం కొనుగోలు విషయం పై ముఖ్య మంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన లో బిజీ బిజి గా ఉన్నారు. ఢిల్లీ పర్యటన లో వరి ధాన్యం విషయంలో కేంద్ర మంత్రు లతో సమావేశం కావడానికి సిద్ధమవుతున్నాడు. అందు లో భాగం గా ఈ రోజు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల , ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రి పీయూష్ గోయల్ తో తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ సమావేశం కానున్నారని సమాచారం.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో తెలంగాణ వరి ధాన్యం కొనుగోలు చేయాలని విజ్ఞాప్తి చేయనున్నారని తెలుస్తుంది. ప్రతి ఏడాది తెలంగాణ నుంచి ఎన్ని టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేస్తారనే విషయాన్ని స్పష్టం చేయాలని అడిగే అవకాశం ఉంది. కాగ తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ మరి కొంత మంది కేంద్ర మంత్రు ల తో కూడా సమావేశం అయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే సీఎం కేసీఆర్ వరి ధాన్యం పై క్లారిటీ వచ్చే వరకు ఢిల్లీ లో నే ఉంటారని తెలుస్తుంది. అందులో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో కూడా సమావేశం కావాలని ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.