రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు సకాలంలో ప్రవేశించినప్పటికీని కూడా రైతులతో మాత్రం వర్షాలు దోబుచులాడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో నల్లటి మేఘాలు పట్టినప్పటికీ వర్షాలు మాత్రం పడటం లేదు.దీంతో పూర్తిగా వర్షాల పై ఆదారపడిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నరు.
ఈ క్రమంలో తెలంగాణ రైతులకు హైదరాబాద్ వాతావరణ శాఖ గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ముఖ్యంగా వరంగల్,ములుగు, కొత్తగూడెం,ఖమ్మం, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని, ఆ సమయంలో గంటలకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.ఇక ఈ జిల్లాలకు వాతావరణ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కాగా శనివారం రాత్రి నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో తుఫాన్ మాదిరిగా చిరు జల్లులు కురుస్తున్నాయి. రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.