ఈనెల 27న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..

వరస అల్పపీడనం, వాయుగుండాలతో తమిళనాడు, ఏపీ ప్రజలను వణికిస్తున్నాయి. దాదాపు నెల కాలం నుంచి వరస వర్షాలతో ఈ రెండు ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాుయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాయసీమలోని అన్న జిల్లాలు వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయాయి. మరోవైపు తమిళనాడు కూడా ఈ తరహా పరిస్థితులనే ఎదుర్కొంది. తమిళనాడు కోస్తా జిల్లాలు, డెల్టా ప్రాంతంతో పాటు చెన్నై నగరం కూడా అతలాకుతలం అయింది.

ఇదిలా ఉంటే తాజాగా మరో అల్పపీడనం ఏపీ, తమిళనాడును బయపెడుతోంది. ఈనెల 27న దక్షిణ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నెల్లూర్, చిత్తూర్, కడప, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.  మరోవైపు తమిళనాడుకు కూడా వర్షాలు పొంచి ఉన్నాయి. నాలుగు రోొజుల పాటు తమిళనాడులో వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చిరించింది. తమిళనాడుకు ఎల్లో అలెర్ట్ కూడా జారీ చేసింది. ఈెనెల 27 నుంచి డిసెంబర్ 4 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది.