తెలంగాణ రైతులకు శుభవార్త..మరో వారంలోనే రైతు బంధు నిధులు మంజూరు

-

తెలంగాణ రాష్ట్ర రైతులకు కెసిఆర్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. వర్షాకాలం రైతు బంధు డబ్బులు విడుదలపై కీలక ప్రకటన చేసింది. వానాకాలం సీజన్ రైతుబంధు డబ్బులను మరో వారం లేదా పది రోజులలో రైతుల ఖాతాలలో జమ చేసేందుకు వ్యవసాయ శాఖ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 65 లక్షల మంది రైతులు ఎకరాకు ఐదు వేల చొప్పున ఏకంగా 7400 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

మొదటి రోజు ఎకరం లోపు రైతులకు… ఆ తర్వాత రోజు ఒక్కో ఎకరా పెంచుకుంటూ జూన్ ఆఖరి వరకు ఖాతాలో డిపాజిట్ చేయనుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ రైతుబంధు డబ్బులు వర్షాకాలం పంట కోసం వినియోగించుకోవచ్చని పేర్కొంది.కాగా, తెలంగాణ రాష్ట్రంలోని బీసీ కుల వృత్తులు, చేతివృత్తుల వారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది కేసీఆర్ సర్కార్. బీసీ కుల వృత్తులు, చేతివృత్తుల వారికి లక్ష సాయం అందించే కార్యక్రమాన్ని ఇవ్వాళ సీఎం కేసీఆర్ చాలా ఘనంగా ప్రారంభించనున్నారు. మొదటగా 200 మందికి ఈ సహాయం చేయనున్నారు సీఎం కేసీఆర్. కాగా 15 బీసీ కులాలకు చెందినవారు సహాయం కోసం tsobmmsbc.cgg.gov.in అనే వెబ్సైట్ లో ఈనెల 20 లోపు దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది కేసీఆర్ సర్కార్.

Read more RELATED
Recommended to you

Latest news