నిరాడంబరంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కుమార్తె పెళ్లి

-

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కుమార్తె వివాహం అత్యంత దగ్గరి బంధువుల మధ్య చాలా నిరాడంబరంగా జరిగింది. అతి కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో బెంగళూరులోని నిర్మలా సీతారామన్ ఇంట్లో ఈ పెళ్లి వేడుక జరిగింది.

పరకాల వాంగ్మయి పెళ్లి ప్రతీక్‌తో వివాహానికి అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రమేహాజరయ్యారు. రాజకీయ ప్రముఖులు ఎవరూ ఈ కార్యక్రమానికి రాలేదని తెలిసింది. నిర్మలా సీతారామన్ కుటుంబ సభ్యులు ఈ వివాహానికి సంబంధించిన వివరాలను అధికారికంగా బయటకు వెల్లడించలేదు. కానీ, వివాహానికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ఉడిపిలోని అదమరు మఠానికి చెందిన పురోహితులు ఈ వివాహ క్రతువును నిర్వహించారు. బ్రాహ్మణ సంప్రదాయాలు, ఆచారాల ప్రకారం వివాహం జరిపించారు. వధువు పరకాల వాంగ్మయి.. గులాబీ రంగు చీర, ఆకుపచ్చ రవికలో మెరిసిపోయారు. వరుడు ప్రతీక్ తెలుపు వర్ణం పంచెలో పెళ్లి వేదికపై కనిపించారు. నిర్మలా సీతారామన్.. మొలకల్మూరుకు చెందిన ప్రత్యేక చీరను ధరించి వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Read more RELATED
Recommended to you

Latest news