మాజీ ముఖ్యమంత్రిని కూడా వదలని సైబర్ నేరస్థులు..!

-

మాజీ ముఖ్యమంత్రిని కూడా సైబర్ నేరస్థులు వదలలేదు. మాజీ ముఖ్యమంత్రి పేరుతో భారీ సైబర్ మోసానికి పాల్పడారు. డ్రగ్స్ , హత్య కేసులో కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తామంటూ బెదిరించి.. హైదరాబద్ కు చెందిన గృహిణి నుండి రూ.40 లక్షలు కాజేశారు చీటర్స్. హైదరాబద్ కు చెందిన 40 ఏళ్ల గృహిణికి ఫెడెక్స్ కొరియర్ పేరిట కాల్ చేసిన చీటర్స్.. ఆమె ఆధార్ నెంబర్ తో ఎమ్.డి.ఎమ్.ఏ డ్రగ్స్ పర్సెల్ వచ్చిందని పేర్కొన్నారు.

ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు కాల్ ఫార్వార్డ్ చేసినట్లు నమ్మించారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫోటో పంపి, ప్రపంచవ్యాప్తంగా సంబంధాలు ఉన్నాయని.. తాము చెప్పిన విధంగా డబ్బు పంపించాలని , లేదంటే ఆమె కుటుంబ సభ్యుల ఖాతాలను ఫ్రీజ్ చేస్తామని.. ఫ్యామిలీ మెంబెర్స్ ను అరెస్టు చేయిస్తామని బెదిరించారు. భయాందోళనకు గురైన బాధితురాలు రూ. 40 లక్షలు వారు చెప్పిన ఖాతాకు బదిలీ చేసింది. తాను మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news